Best Selling Two-Wheeler: దేశంలో నంబర్ వన్ టూవీలర్ ఇదే.. హీరో నుంచి హోండా వరకు లిస్ట్ చెక్ చేయండి..!

Best Selling Two-Wheeler: ఆగస్టు 2024లో హీరో స్ప్లెండర్ బెస్ట్ సెల్లింగ్‌ బైక్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

Update: 2024-09-22 13:13 GMT

hero splendor plus

Best Selling Two-Wheeler: దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో గత నెల అంటే ఆగస్టు 2024లో వీటి అమ్మకాలు గురించి మాట్లాడితే.. హీరో స్ప్లెండర్ మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. హీరో స్ప్లెండర్ గత నెలలో మొత్తం 3,02,234 యూనిట్ల బైక్‌లను విక్రయించింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఇదే టైమ్‌కి ఆగస్టు 2023లో హరో స్ప్లెండర్ మొత్తం 2,89,930 యూనిట్లు సేల్ చేసింది. వార్షిక ప్రాతిపదికన హీరో స్ప్లెండర్ అమ్మకాలలో 4.49 శాతం వృద్ధిని సాధించింది. హీరో స్ప్లెండర్ మాత్రమే 26.25 శాతం ద్విచక్ర వాహనాల విక్రయాలను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ విక్రయాల జాబితాలో హోండా యాక్టివా రెండో స్థానంలో నిలిచింది. హోండా యాక్టివా గత నెలలో 5.86 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 2,27,458 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా, ఈ విక్రయాల జాబితాలో హోండా షైన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో హోండా షైన్ వార్షికంగా 31.15 శాతం పెరుగుదలతో మొత్తం 1,49,697 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

ఇది కాకుండా ఈ జాబితాలో బజాజ్ పల్సర్ నాల్గవ స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ గత నెలలో 28.19 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 1,16,250 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ విక్రయాల జాబితాలో టీవీఎస్ జూపిటర్ ఐదో స్థానంలో ఉంది. TVS జూపిటర్ గత నెలలో 27.49 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 89,327 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

మరోవైపు ఈ విక్రయాల జాబితాలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఆరో స్థానంలో ఉంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గత నెలలో 15.89 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 84,660 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే ఈ విక్రయాల జాబితాలో సుజుకి యాక్సెస్ ఏడవ స్థానంలో ఉంది. సుజుకి యాక్సెస్ గత నెలలో 16.37 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 62,433 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

అదే సమయంలోTVS XL ఈ విక్రయాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. TVS XL గత నెలలో 22.06 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 44,546 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే ఈ విక్రయాల జాబితాలో బజాజ్ ప్లాటినా తొమ్మిదో స్థానంలో ఉంది. బజాజ్ ప్లాటినా గత నెలలో వార్షికంగా 3 శాతం పెరుగుదలతో మొత్తం 41,915 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా ఈ విక్రయాల జాబితాలో హోండా డియో పదో స్థానంలో ఉంది. హోండా డియో వార్షికంగా 19.83 శాతం పెరుగుదలతో మొత్తం 34,705 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

Tags:    

Similar News