Yamaha RX 100: 1985 నుండి 1996 వరకు రోడ్లను శాసించిన ఆర్ఎక్స్ 100 మళ్లీ రాబోతుందా..?
Yamaha RX100 : 80లు 90ల్లో భారతదేశంలో యమహాఆర్ఎక్స్ 100 మోటార్‌సైకిళ్లు రోడ్లను శాసించాయి.
Yamaha RX100 : 80లు 90ల్లో భారతదేశంలో యమహాఆర్ఎక్స్ 100 మోటార్‌సైకిళ్లు రోడ్లను శాసించాయి. మన అమ్మనాన్నలను అడిగితే ఈ బైక్‌కి సంబంధించిన కథలను చెబుతారు. ఈ బైక్ త్వరలో తిరిగి మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఇది వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దాని ప్రారంభానికి సంబంధించి కొన్ని అప్ డేట్ లు వచ్చాయి. యమహా ఆర్ఎక్స్ 100 లాంచ్ అయిందని చాలా మీడియా రిపోర్టులలో క్లెయిమ్ చేస్తున్నారు. దీని బుకింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది మాత్రమే కాకుండా, కంపెనీ ఈసారి దాని వారసత్వాన్ని ఉపయోగించుకోవడానికి యమహా RX100 అని పేరు పెట్టింది, కానీ ఈసారి దాని ఫీచర్లు, ఇంజిన్‌ను అప్ డేట్ చేసింది.
యమహా ఆర్ఎక్స్ 100 లాంచ్?
యమహా మోటార్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళితే.. ఈ బైక్ లాంచ్‌కు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ మీకు లభించదు. Yamaha RX100 తిరిగి రావడానికి సంబంధించి Yamaha Global నుండి అధికారిక ప్రకటన ఏం కాలేదు. అయితే, ఈ బైక్ త్వరలో భారత మార్కెట్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో జావా, యెజ్డీ , BSA వంటి క్లాసిక్ బైక్‌లు భారతీయ మార్కెట్లో బలమైన పునరాగమనం చేశాయి. కొంతమంది యూట్యూబ్ వ్లాగర్ల నుండి ఆటో బ్లాగర్ల వరకు తమ పోస్ట్‌లలో యమహా ఆర్ఎక్స్ 100 లాంచ్ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అయ్యింది. ఇది పూర్తిగా ధృవీకరించబడలేదు.
Yamaha RX100 1985 లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలో యమహా దీనిని జపాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకుంటూనే ఉంది. కానీ 1990లలో ఐషర్ మోటార్స్ దీనిని భారతదేశంలో తయారు చేయడానికి లైసెన్స్‌ని తీసుకుం. ఇది 1996 వరకు భారతదేశంలో ఉత్పత్తి, విక్రయం కొనసాగింది. యమహా RX100 జనాదరణకు అతిపెద్ద కారణం దాని డిజైన్. ఇది 98cc 2-స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది ఆ సమయంలో అద్భుతమైన శక్తిని ఇచ్చింది. భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను అభివృద్ధి చేశారు. భారతీయ కస్టమర్లు దాని సీటు ఎత్తు, తక్కువ బరువును ఇష్టపడ్డారు. 2-వీలర్లలో స్కూటర్‌లకు ప్రాధాన్యత ఉన్న సమయంలో బజాజ్ చేతక్ మార్కెట్ ను శాసిస్తున్న సమయంలో యమహా RX100 భారతదేశానికి వచ్చింది. యమహా RX100 రోడ్లపై చేతక్ ఆధిపత్యానికి బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే దాని తక్కువ బరువు కారణంగా ఇది స్కూటర్ల కంటే మెరుగైన మైలేజీని ఇచ్చింది.
1994 సంవత్సరం నాటికి, మార్కెట్ 4-స్ట్రోక్ ఇంజిన్‌లకు మారడం ప్రారంభించింది. ఈ మార్పు బజాజ్ చేతక్‌ను కూడా ప్రభావితం చేసింది. హీరో హోండా (ప్రస్తుతం హీరో మోటోకార్ప్) 4-స్ట్రోక్ ఇంజన్‌లో హీరో స్ప్లెండర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొద్ది కాలంలోనే, స్ప్లెండర్ మార్కెట్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. నేటికీ ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న 2-వీలర్. హీరో యమహా చేసిన తప్పును పునరావృతం చేయలేదు. ఎప్పటికప్పుడు స్ప్లెండర్‌లో మార్పులు చేస్తూ స్ప్లెండర్+ , సూపర్ స్ప్లెండర్ వంటి మోడళ్లను విడుదల చేసింది.