Electric Scooter Subsidy: మహిళలకు ప్రభుత్వం వరం.. ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే రూ.36 వేల సబ్సిడీ.. వీరికి మాత్రమే..!

Electric Scooter Subsidy: ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనుంది. బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే మహిళలకు రూ.36,000 వరకు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తోంది.

Update: 2025-04-12 13:30 GMT
Electric Scooter Subsidy

Electric Scooter Subsidy: మహిళలకు ప్రభుత్వం వరం.. ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే రూ.36 వేల సబ్సిడీ.. వీరికి మాత్రమే..!

  • whatsapp icon

Electric Scooter Subsidy: ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనుంది. బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే మహిళలకు రూ.36,000 వరకు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తోంది. పాలసీ ముసాయిదా ప్రకారం, e-V ద్విచక్ర వాహనాలపై సబ్సిడీలో తగ్గింపు ప్రయోజనం మొదట దరఖాస్తు చేసుకునే 10 వేల మంది మహిళలకు మాత్రమే అందిస్తుంది.

మహిళలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి, కిలోవాట్ అవర్‌కు రూ. 12,000 సబ్సిడీ ఇవ్వచ్చు, ఇది గరిష్టంగా రూ. 36,000 వరకు ఉండవచ్చు. దరఖాస్తు చేసుకునే మొదటి 10,000 మంది మహిళలకు సబ్సిడీపై తగ్గింపు లభిస్తుంది. మహిళా దరఖాస్తుదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం కూడా తప్పనిసరి. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. దీనిని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఆమోదించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి అనుబంధంగా ఢిల్లీ ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2.0 రూపొందించింది. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. EV పాలసీ 2.0 మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుంది. ఈ పాలసీ కింద, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా, మూడు చక్రాల వాహనాలు, వాణిజ్య వాహనాలను కూడా ప్రోత్సహిస్తారు.

నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం రూ.30,000 వరకు సబ్సిడీని ప్రకటించవచ్చు. ద్విచక్ర వాహనాలతో పాటు, L5M కేటగిరీలో ప్రతి KWH కి రూ. 10,000 చొప్పున ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కొనుగోలు చేస్తే రూ. 45,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ఇది కాకుండా, 12 సంవత్సరాల కంటే పాత వాహనాలను స్క్రాప్ చేయడంపై రూ. 10,000 అదనపు ప్రయోజనం పొందచ్చు.

Tags:    

Similar News