Upcoming 7 Seater Cars: ఫ్యామిలీ కార్లు వచ్చేస్తున్నాయ్.. ఏడుగురు సేఫ్‌గా ప్రయాణించచ్చు..!
Upcoming 7 Seater Cars: 7 - సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా, హై క్రాస్ వంటి ఎమ్‌విపిలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
Upcoming 7 Seater Cars: 7 - సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా, హై క్రాస్ వంటి ఎమ్‌విపిలు అత్యంత ప్రజాదరణ పొందాయి. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త 7-సీటర్ కారును కొనాలని చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో MG మోటార్, జీప్, మారుతి సుజుకీ వంటి కంపెనీలు తమ 7 సీటర్ మోడల్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే మూడు 7 సీటర్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
MG Gloster Facelift
MG గ్లోస్టర్ ఎల్లప్పుడూ భారతీయ కస్టమర్లలో ఒక ప్రసిద్ధ MPV. ఇప్పుడు కంపెనీ రాబోయే కొద్ది నెలల్లో MG గ్లోస్టర్ అప్‌గ్రూేడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్టింగ్ సమయంలో MG గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ చాలాసార్లు కనిపించింది. MG గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్, ఇంటిరియర్‌లో కస్టమర్‌లు పెద్ద మార్పులను చూస్తారని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే కారు పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు.
Jeep Meridian Facelift
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ తన పాపులర్ ఎమ్‌పివి మెరిడియన్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అప్‌గ్రేడ్‌గా కారులో అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS), అనేక ఆధునిక ఫీచర్లు అందించే అవకాశం ఉంది. ఇది కాకుండా కస్టమర్లు కారులో రిఫ్రెష్ చేసిన గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందబోతున్నారు.
7-Seater Grand Vitara
దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకి తన ప్రముఖ SUV గ్రాండ్ విటారాలో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ వేరియంట్ 2025 సంవత్సరంలో షోరూమ్‌లలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.