2025 Hero Splendor Plus: కోట్ల మంది కొన్న బైక్.. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మళ్లీ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
2025 Hero Splendor Plus: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ బైక్ స్ప్లెండర్ ప్లస్‌లో కొత్త అవతార్‌లో తీసుకొస్తోంది.

2025 Hero Splendor Plus: కోట్ల మంది కొన్న బైక్.. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మళ్లీ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
2025 Hero Splendor Plus: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బెస్ట్ సెల్లింగ్ ఎంట్రీ లెవల్ బైక్ స్ప్లెండర్ ప్లస్‌లో కొత్త అవతార్‌లో తీసుకొస్తోంది. ఈ బైక్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త మోడల్‌లో స్వల్ప మార్పులు కనిపించవచ్చు. అంతే కాకుండా, ఈ బైక్ ఇంజిన్‌లో కూడా మార్పులు చూడచ్చు. ఇప్పటి వరకు ఈ బైక్ 4 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.
కొత్త స్ప్లెండర్ ప్లస్‌లో అప్‌గ్రేడ్ చేసిన OBD-2B ఇంజన్ ఉంటుంది. ఈ 97.2సీసీ ఇంజన్ సింగిల్ సిలిండర్‌గా ఉంటుంది. ఇది 8.02పిఎస్ పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అయితే ఈసారి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అందించే అవకాశం ఉంది. కొత్త ఇంజన్ మెరుగైన మైలేజీతో బలమైన పనితీరును అందించడంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.
మీడియా నివేదికల ప్రకారం.. జైపూర్‌లో కొత్త స్ప్లెండర్ ప్లస్ కనిపించింది. ఈసారి కొత్త రంగుల్లో రానుంది. సైడ్ ప్యానెల్‌లో ఎక్కువ గ్రాఫిక్స్ కనిపించవు. ఇందులో 18 అంగుళాల టైర్లను చూడచ్చు. 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ సౌకర్యాన్ని బైక్‌లో చూడవచ్చు. ఈసారి డిస్క్ బ్రేక్ సదుపాయం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 165మిమీ ఉంటుంది. ప్రస్తుత స్ప్లెండర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.77,176. కొత్త మోడల్ ధర రూ.80 వేల లోపే ఉండొచ్చు.
హీరో కొత్త స్ప్లెండర్ ప్లస్ నేరుగా హోండా షైన్ 100తో పోటీపడుతుంది. ఇంజన్ గురించి చెప్పాలంటే, షైన్ 100లో 98.98 సీసీ 4 స్ట్రోక్, SI ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.28 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా ఉంటుంది. ఇంజిన్ మృదువైనది,మంచి మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.66,900 నుండి ప్రారంభమవుతుంది.