Maruti Suzuki: 2 రూపాయల ఖర్చు.. 32 కిమీల మైలేజీ.. మార్కెట్‌లో బాహుబలిని దింపేసిన మారుతీ.. ఫీచర్లు, ధరెంతంటే?
Maruti Suzuki Swift CNG: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) 2024 స్విఫ్ట్‌తో మార్కెట్‌లో దూసుకెళ్తోంది.
Maruti Suzuki Swift CNG: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) 2024 స్విఫ్ట్‌తో మార్కెట్‌లో దూసుకెళ్తోంది. మార్కెట్ మందగమనంలో ఉన్నప్పటికీ, గత 4 నెలల్లో కంపెనీ ఇప్పటికే 67,000 యూనిట్ల హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. అంతేకాకుండా, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ విక్రయించే ప్రతి 10 కార్లలో 3 CNGలు ఉన్నాయి. ఇదే క్రమంలో దేశంలో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGని పరిచయం చేసింది. రూ. 8.19 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఇది కిలో సీఎన్‌జీకి 32.85 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ CNG: వేరియంట్లు, ధర..
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNG మొత్తం 3 వేరియంట్‌లలో వచ్చింది. వీటిలో VXI, VXI+, ZXI ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 8,19,500, రూ. 8,46,500, రూ 9,19,500లుగా ఉన్నాయి
మారుతి సుజుకి స్విఫ్ట్ VXi CNG - రూ. 8,19,500
మారుతి సుజుకి స్విఫ్ట్ VXi (O) CNG - రూ. 8,46,500
మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG - రూ. 9,19,500
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ CNG: స్పెషిఫికేషన్స్..
2024 స్విఫ్ట్‌లోని అదే 1.2L Z-సిరీస్ ఇంజిన్ అందించారు. ఇది CNG మోడ్‌లో 69.75 Hp గరిష్ట పవర్ అవుట్‌పుట్, 101.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటారు 5-స్పీడ్ MTకి జత చేశారు. పెట్రోల్ రూపంలో, ఇది 81.6 Hp గరిష్ట శక్తిని, 112 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ CNG: మైలేజ్, రన్నింగ్ కాస్ట్..
మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNG కోసం 32.85 km/kg మైలేజీని క్లెయిమ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీలో CNG ధర కిలోకు 76.59గా పరిగణిస్తే.. స్విఫ్ట్ కిలోమీటరుకు కేవలం రూ. 2.33లు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ రూపంలో, స్విఫ్ట్ MT 24.8 kmpl మైలేజీ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ CNG: ఫీచర్లు..
ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. ఇంకా, స్విఫ్ట్ S-CNG ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్ల శ్రేణితో వస్తుంది.