Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (జనవరి 26 - ఫిబ్రవరి 1)

Weekly Horoscope in Telugu, 2025 January 26 to February 1: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Update: 2025-01-25 19:06 GMT
Weekly Horoscope

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (జనవరి 26 - ఫిబ్రవరి 1)

  • whatsapp icon

Weekly Horoscope in Telugu, 2025 January 26 to February 1: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం 

వారమంతా, పట్టింది బంగారం అన్నట్లు సాగుతుంది. జీవితంలో స్థిరత్వం దిశగా ఎన్నో అవకాశాలు వస్తాయి. చక్కగా సద్వినియోగం చేసుకోండి. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న అభీష్టం కూడా నెరవేరుతుంది. పోటీదారులను చిత్తు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ శుభకార్యాచరణపై దృష్టి పెడతారు. స్నేహితులు అండగా నిలుస్తారు. రుణం చెల్లింపు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించండి. లేత పసుపు వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం 

ఆకాంక్షలు నెరవేరతాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇతరులతో విభేదాలు ఏర్పడినా మీమాటే చెల్లుబాటు అవుతుంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవిలోని వారి సహకారం అందుతుంది. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతల్లో తేలిగ్గా ఒదిగిపోతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. అనవసర పోటీల వల్ల అన్నిరకాలుగా నష్టపోతారు. ఖర్చు తగ్గించండి. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం: శ్రీసూర్య భగవానుడిని ఆరాధించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం 

అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. అంతర్గత ఆనందం పెరుగుతుంది. స్వేచ్ఛాజీవితంపై అనురక్తి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. ఎగుమతులు, దిగుమతుల రంగాల్లోని వారికి బాగుంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం లభిస్తుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సూచనలు ఉపకరిస్తాయి. భోజనంపై నియంత్రణ ఉండాలి. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. శత్రుపీడ ఉంటుంది. తగాదాలు వద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

పరిహారం: శ్రీదుర్గాదేవిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

వ్యవహారాలన్నింటిలోనూ శుభ ఫలితాలుంటాయి. చర్చల ద్వారా అపార్థాలను తొలగించుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విలువైన వస్తువును సొంతం చేసుకుంటారు. బంధువులు సహకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనువుగా ఉంది. వారసత్వ ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి.

పరిహారం: శ్రీగాయత్రీ మాతను పూజించండి. కుంకుమ వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

సింహం 

అన్ని అడ్డంకులూ తొలగిపోతాయి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కీలక వ్యవహారాల్లో బంధువుల సహాయం ఉపకరిస్తుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. మానసిక, శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. సంతాన సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది. చెడు ఆలోచనలను తగ్గించండి. అవసరం లేని చోట సామర్థ్యాన్ని చూపకండి. బద్ధకం వద్దు.

పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య 

చేస్తున్న పనుల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. సందేహాలు నివృత్తి అవుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొంటారు. బలహీనతలను జయించే ప్రయత్నం అనుకూలిస్తుంది. న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. ఆస్తి సంబంధ లావాదేవీలు ఆశించినట్లుగా ఉండవు. రక్త సంబంధీకుల గురించి కలవర పడతారు. ఖర్చులను తగ్గించండి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ప్రతి నిర్ణయంలోనూ ముందుచూపుతో వ్యవహరించండి.

పరిహారం: శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల 

స్థిరచిత్తంతో సాగించే కార్యక్రమాలు సఫలం అవుతాయి. మీలోని నైపుణ్యానికి విశేష లాభం ఉంటుంది. ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణను కలిగిస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. దాయాదులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. కీలకమైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి రంగంలోని వారికి ప్రతి పనిలోనూ అడ్డంకులుంటాయి. సంతాన వ్యవహారాలు నిరాశపరుస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

పరిహారం: శ్రీదక్షిణామూర్తిని ఆరాధించండి. తెలుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం 

నాయకత్వ లక్షణాలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. స్వశక్తితో ఎదిగే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. గృహోపకరణాలను కొంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. సోదరుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. సహచరులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం వినోదంగా సాగుతుంది. బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లుగా సాగవు. అనవసర తగాదాలకు దిగకండి. ముఖ్యంగా స్థిరాస్తి, విద్య, సేవా రంగాల్లోని వారు స్వీయ నియంత్రణతో ఉండాలి. బద్ధకం వద్దు.

పరిహారం: శ్రీపార్వతీదేవిని పూజించండి. ముదురు కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు 

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆకాంక్ష బలపడుతుంది. ఈ దిశగా సాగించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందం రెట్టింపు అవుతుంది. కొత్త బంధాలు బలపడతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. బాల్యస్నేహితులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఏమంత తృప్తినివ్వవు. ఇచ్చిన మాట తప్పడం వల్ల అవమానాన్ని ఎదుర్కొంటారు.

పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం 

వ్యవహార జయం ఉంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కీలక సందర్భాల్లో అదృష్టం తోడుంటుంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. తెలివితేటలు రాణిస్తాయి. బంధువుల్లో చక్కటి గుర్తింపును పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అనూహ్య ఖర్చులుంటాయి. అనవసర పంతాలకు పోకండి. భారీగా నష్టపోతారు. ఒంటరిని అన్న భావన కలుగుతుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం: శ్రీశివపార్వతుల క్షేత్రాన్ని దర్శించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం 

ఆకాంక్షలు నెరవేరతాయి. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు. రుణవిముక్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. తెలివితేటలకు గుర్తింపు ఉంటుది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కీలక వ్యవహారంలో అదృష్టం వరిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణ యత్నం ఫలిస్తుంది. బంధువుల అనారోగ్యం కలవరపరుస్తుంది. బద్ధకం వద్దు.

పరిహారం: శ్రీగణపతిని పూజించండి. ముదురు నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం 

జీవితం పురోభివృద్ధి దిశగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. మేలిమి అవకాశాలు అందివస్తాయి. మీలోని నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదల ఉంది. దూర ప్రాంతాల్లో స్థిరనివాసం దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత స్థాయిలోని వారు సహకరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్ని పెంచుతాయి. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. అనూహ్య ఖర్చులుంటాయి.

పరిహారం: శ్రీగురు క్షేత్రాన్ని దర్శించి పూజించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

Tags:    

Similar News