Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (31/1/2025)
Daily Horoscope Today In Telugu, January 31, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (31/1/2025)
Daily Horoscope Today In Telugu, January 31, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
మేషం
లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. విందుకు హాజరవుతారు. ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.
వృషభం
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అవకాశాలు అందివస్తాయి. ఆర్థికంగానూ వృద్ధి చెందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులను జయిస్తారు. అభీష్టం నెరవేరుతుంది.
మిథునం
ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. విధి నిర్వహణలో అప్రమత్తంగా లేకుంటే నష్టపోతారు. అనవసర గోడవలకు ఆస్కారముంది. త్వరగా అలసిపోతారు. పెద్దలను కలుస్తారు. ప్రయాణం వల్ల లాభముండదు.
కర్కాటకం
బలహీనతలను అదుపు చేసుకోవాలి. అనవసరపు అపోహలను వీడండి. చెప్పుడు మాటలను వినకండి. అనుకున్న రీతిలో పనులు సాగవు. తగాదాలకు దిగకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరొగ్యం జాగ్రత్త.
సింహం
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అంతర్గత ఆనందాలు తీరతాయి. ఇతరులతో సంబంధబాంధవ్యాలు పెరుగుతాయి. కీలక కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
కన్య
వివాదాలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. నూతన వస్తువులను కొంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధువులు సమకరిస్తారు.
తుల
పనులు ఆశించిన స్థాయిలో జరగవు. అవసరమైన మేరకే డబ్బు అందుతుంది. అభీష్టం నెరవేరే సూచన లేదు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచన తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
వృశ్చికం
డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు. కార్యనష్టాలు చికాకును కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వాహన సంబంధ సమస్య వస్తుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు.
ధనుస్సు
వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. ఆదాయం మెరుగవుతుంది. సాహసోపేత నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణ ప్రయోజనాన్ని పొందుతారు.
మకరం
అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. నిందలొచ్చినా నిబ్బరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టండి. భవిష్యత్తు గురించి ప్రణాళిక వేస్తారు.
కుంభం
అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. మీ నడవడికకు ప్రశంసలు లభిస్తాయి. ఎదుగుదలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదృష్టం వరిస్తుంది.
మీనం
పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు కూడా నిరాశ పరుస్తాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.