Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (30/1/2025)

Daily Horoscope Today In Telugu, January 30, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-29 20:24 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (30/1/2025)

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, January 30, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం 

ఇష్ట కార్యాలు అనుకూలంగా సాగుతాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. అధికార వృద్ధి ఉంది. పెద్దల అభిమానాన్ని పొందుతారు. సమర్థతకు తగ్గ గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు.

వృషభం 

పనులకు ఒడుదుకులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తీర్థ క్షేత్రాన్ని సందర్శిస్తారు. గురువుల ఆశీస్సులను తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం 

అనుకున్న రీతిలో పనులు సాగవు. నమ్మినవారి చేతిలో మోసపోతారు, మనసుకి కష్టంగా ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. వృథా ఖర్చులుంటాయి. తగాదాలకు దూరంగా ఉండండి. పెద్దల కోపానికి గురవుతారు.

కర్కాటకం

కొత్త బంధాలు లాభసాటిగా ఉంటాయి. నూతన విజ్ఞానం పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలూ అనుకూలిస్తాయి. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణ ప్రయోజనాన్ని పొందుతారు.

సింహం 

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. ఇతర వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.

కన్య 

బద్ధకం ఇబ్బందిని పెంచుతుంది. అనవసరమైన చోట మీ తెలివితేటలను ప్రదర్శించకండి. అనుమానం వీడి చిత్తశుద్ధితో కష్టపడితే తగిన ఫలితం దక్కుతుంది. విలువైన వస్తువులు చోరీకి గురయ్యే సూచన ఉంది. జాగ్రత్త.

తుల 

మీ పనులను ఆటంకపరిచే వారు పెరుగుతారు. ముఖ్యంగా ఆస్తి వ్యవహారాల్లో బాగా ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్యారంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

వృశ్చికం 

వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రియతములతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

ధనుస్సు 

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపాలి. వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సాగవు. ముఖ్యంగా ఆర్థిక అంశాలు చికాకు పెడతాయి. మనసులోని భావాన్ని చెప్పలేక పోతారు. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది.

మకరం 

ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. గౌరవం పెరుగుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు.

కుంభం 

పనుల్లో విపరీతమైన జాప్యం కోపాన్ని తెప్పిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. ఇతరుల వల్ల ఇబ్బంది వస్తుంది. బంధువుల ఆరోగ్యం కలవరపరుస్తుంది. కోర్టు విషయాల్లో జాగ్రత్త. నిద్రలేమి వేధిస్తుంది.

మీనం 

అభీష్టం నెరవేరుతుంది. కోరుకున్న వస్తువును సేకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

Tags:    

Similar News