Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/1/2025)
Daily Horoscope Today In Telugu, January 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/1/2025)
Daily Horoscope Today In Telugu, January 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు
మేషం
పనులు సవ్యంగా జరగవు. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. స్వల్పంగా తగాదాలకూ ఆస్కారం ఉంది. స్పెక్యులేషన్స్‌కు దూరంగా ఉండండి. శత్రుపీడ పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
వృషభం
ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. నిజాయితీకి తగ్గ గుర్తింపుంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.
మిథునం
చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆప్తమిత్రుడిని సంప్రదించండి. ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం తోడుంటుంది. స్వస్థానం చేరుకుంటారు.
కర్కాటకం
ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. బద్ధకం వదిలి కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమికుల మధ్య సఖ్యత చెడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహం
ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. మీకు చెందిన రహస్యం బయటపడే సూచన ఉంది. అందరినీ గుడ్డిగా నమ్మకండి. బుద్ధి నిలకడగా లేక బంధువులతోనూ విరోధం పెంచుకుంటారు. అవమానం గోచరిస్తోంది.
కన్య
వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. పురోభివృద్ధి దిశగా ప్రణాళికలను అమలు చేస్తారు. స్వయంకృషి వల్ల అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సోదరుల సమస్యను పరిష్కరిస్తారు.
తుల
అనుకున్నవి జరగవు. ప్రత్యర్థుల కుట్రలు పెరుగుతాయి. నిజాయితీని వదులుకోకండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించాలి. వేళకు భోజనం ఉండదు. ఆస్తి లావాదేవీలు వాయిదా వేయండి. నిందలు వస్తాయి. జాగ్రత్త.
వృశ్చికం
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు ఆనందాన్ని పెంచుతాయి.
ధనుస్సు
పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. కోర్టు లావాదేవీల్లో నిర్లక్ష్యం వహిస్తే, భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అనూహ్యమైన ఖర్చులు వస్తాయి. మిత్రుల సహకారం లభించదు. కంటికి సంబంధించిన సమస్య వుంటుంది.
మకరం
అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు. మిత్రులు సహకరిస్తారు. ప్రత్యర్థులను జయిస్తారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులతో శుభకార్యాలకు వెళతారు.
కుంభం
అజమాయిషీ చేసే స్థితిలో ఉంటారు. వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
మీనం
న్యాయపరమైన చికాకులు తలెత్తుతాయి. పనులు కూడా సవ్యంగా సాగవు. సంతానం తీరును విభేదిస్తారు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. బలహీనతలను జయించాలి. ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది.