
Daily Horoscope Today In Telugu, January 24, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : దశమి సాయంత్రం గం.7.25 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి
నక్షత్రం: అనూరాధ (పూర్తి)
అమృతఘడియలు: రాత్రి గం.7.52 ని.ల నుంచి గం.9.37 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.9.28 ని.ల చి గం.11.12 ని.ల వరకు
దుర్ముహూర్తం :ఉదయం గం.9.05 ని.ల నుంచి గం.9.50 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.9.36 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.10.30ని.ల నుంచి గం.12.02 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.50 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం. 6.07 ని.లకు
మేషం : ప్రణాళిక ప్రకారం పనులు సాగవు. నిర్దేశిత లక్ష్యాలు నెరవేరక పోవడం ఆందోళకు కారణమవుతుంది. ఇష్టం లేని పనులను చేయాల్సి వస్తుంది. చెడు ఆలోచనలను దూరం చేయండి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి.
వృషభం : బాంధవ్యాలు పెరుగుతాయి. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఏర్పడుతుంది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు. ప్రయాణం ఉద్దేశం నెరవేరుతుంది. సంతాన సంబంధ ఆకాంక్ష తీరుతుంది. బంధువులను కలుస్తారు.
మిథునం : కీలక వ్యవహారంలో చక్కటి తెలివితేటలతో విజయం సాధిస్తారు. బంధువులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. చర్చల ద్వారా అపార్థాలను తొలగించుకుంటారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొడతారు.
కర్కాటకం: కార్యసాధనలో అడ్డంకులు వస్తాయి. బద్ధకాన్ని వీడి కష్టపడాలి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. నీచపు ఆలోచనలను నియంత్రించాలి. వాత సంబంధ సమస్య ఉంటుంది. విలువైన వస్తువులను భద్రపరచండి.
సింహం : పనులు అనుకున్న రీతిలో సాగవు. లక్ష్యాన్ని అందుకోలేక బాధపడతారు. బుద్ధి నిలకడగా ఉండదు. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. ఒత్తిడి పెరుగుతుంది.
కన్య : వ్యవహారాలన్నీ సవ్యంగా సాగుతాయి. సాహసోపేత నిర్ణయాల వల్ల చక్కటి గుర్తింపు లభిస్తుంది. మిత్రులు సహకరిస్తారు. బంధాలు బలపడతాయి. కమ్యూనికేషన్స్ తృప్తినిస్తాయి. ప్రయాణం వినోదంగా సాగుతుంది.
తుల : కుటుంబ వ్యవహారాలను పట్టించుకోవాలి. అనుకున్నవి జరగవు. ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలి. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. గొడవలు పడకండి. వేళకు భోజనం ఉండదు.
వృశ్చికం : అన్ని రంగాల్లోని వారికీ అనువుగా ఉంటుంది. కీలక సందర్భాల్లో అదృస్టం తోడుగా ఉంటుంది. బాల్య స్నేహితుల కలయిక ఆనందాన్ని పెంచుతుంది. విందులో పాల్గొంటారు. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి.
ధనుస్సు : పనుల పూర్తికి బాగా కష్టపడాలి. ఒకే పని కోసం పదేపదే తిరగాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లు ఉండవు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్య వద్దు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానండి.
మకరం : ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థికంగా బలపడతారు. సహచరుల సహకారం లభిస్తుంది. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. గృహోపకరణాలను కొంటారు. సంతానం వ్యవహారాలు తృప్తినిస్తాయి. మనశ్శాంతిగా ఉంటారు.
కుంభం : అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులకు రివార్డులొస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో విందుకు వెళతారు. గౌరవం పెరుగుతుంది.
మీనం : పనులకు పదేపదే ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. సంతానం తీరు కోపానికి కారణం అవుతుంది. ప్రయాణం వల్ల అలసట తప్పదు. శత్రు పీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
శుభమస్తు