Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (23/1/2025)

Daily Horoscope Today In Telugu, January 23, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-22 20:09 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (23/1/2025)

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, January 23, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం 

ఆశించిన లబ్దిని పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. దేహ సౌఖ్యం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. విందుకు హాజరవుతారు.

వృషభం 

వ్యవహారాలన్నీ శుభప్రదంగా ఉంటాయి. ధనలాభం ఉంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వస్తవులను కొంటారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం బావుంటుంది.

మిథునం 

మీ సమర్థతపై అనుమానాలు వద్దు. కీలక వ్యవహారంలో శక్తి వంచన లేకుండా కృషి చేయండి. సంతాన సంబంధ వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ప్రత్యర్థులు పెరుగుతారు. వాత సంబంధ సమస్య వేధిస్తుంది.

కర్కాటకం

మీ తరహాలోనే ఆలోచించే వారితో పరిచయం ఏర్పడుతుంది. అంతర్గత వ్యవహారాలను బయటపెట్టకండి. బుద్ధి నిలకడ లేక బంధువులతోనే గొడవ పడతారు. స్నేహితుల సూచన పాటించండి. ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు.

సింహం 

సాహసోపేతంగా వ్యవహరిస్తారు. మీలోని నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. తోబుట్టువుల సమస్యను పరిష్కరిస్తారు.

కన్య 

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను కూడా జాగ్రత్త పరచండి. మనసులోని మాట చెప్పలేక ఇబ్బంది పడతారు. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ముందుచూపుతో వ్యవహరించండి.

తుల 

శుభప్రదంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందులో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. సామాజిక అంశాలపై అవగాహన పనికొస్తుంది.

వృశ్చికం 

పనులు అంత తేలిగ్గా పూర్తికావు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వేళకు భోజనం ఉండదు. కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. నిరాశ చెందకండి. తెలివితో ప్రత్యర్థుల కుట్రలను సమర్థంగా తిప్పికొడతారు.

ధనుస్సు 

కీలక వ్యవహారంలో అభీష్టం నెరవేరుతుంది. ఇతరులూ సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. విందుకు వెళతారు. మనశ్శాంతి లభిస్తుంది.

మకరం 

చిత్తశుద్ధితో కృషి చేస్తే ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. దూర ప్రదేశంలో స్థిరనివాసం కోసం చేసే ప్రయత్నం ఓ కొలిక్కి వస్తుంది. ఉద్యోగులు, అధికారుల మన్ననలను పొందుతారు. బంధువు వర్గం ప్రశంసలు లభిస్తాయి.

కుంభం 

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆశించిన ప్రయోజనం దక్కదు. విచారం ఏర్పడుతుంది. పెద్దల సూచనలు సమస్య పరిష్కారానికి ఉపకరిస్తాయి. అశాంతిని వీడి కష్టపడండి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు.

మీనం 

ఉద్రేకం వల్ల పనులు చెడిపోతాయి. ఉద్యోగులు, అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. చెప్పుడు మాటలను నమ్మకండి. అవగాహన లేకుండా పోటీలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News