Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (22/1/2025)

Daily Horoscope Today In Telugu, January 22, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-22 00:29 GMT
Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (22/1/2025)
  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, January 22, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : అష్టమి మధ్యాహ్నం గం.3.18 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: స్వాతి అర్ధరాత్రి దాటాక గం.2.34 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.4.41 ని.ల నుంచి గం.6.29 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.05 ని.ల నుంచి గం.12.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.50 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.06 ని.లకు

మేషం :

అనుబంధాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచన ఉపకరిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. విందుకు హాజరవుతారు.

వృషభం :

వ్యవహారాలన్నింటా విజయం లభిస్తుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ధనలాభం గోచరిస్తోంది.

మిథునం :

సమర్థతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిరాశను వీడి శ్రమించండి. విలువైన వస్తువులను భద్రంగా దాచండి. వృథా ఖర్చులు తగ్గించండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. అభీష్టం నెరవేరదు. బద్ధకం వద్దు.

కర్కాటకం:

స్థిరాస్తి రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. క్రయవిక్రయాల్లో నష్టం గోచరిస్తోంది. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపాలి. ఒత్తిడికి గురవుతారు. గొడవలకు దూరంగా ఉండండి.

సింహం :

సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. కీలక వ్యవహారంలో విశేష లాభాన్ని పొందుతారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. కీలక సమాచారం సంతోషపెడుతుంది.

కన్య :

తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. స్వల్ప అవరోధాలు ఎదురైనా కార్యాలను సాధిస్తారు. ఖర్చులను తగ్గించాలి. అకారణ విరోధాలకు ఆస్కారముంది. అనవసర జోక్యాలు మానుకోండి. వేళకు భోజనం ఉండదు.

తుల :

చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. భవిష్యత్తుకు చెందిన ప్రణాళికల అమలుకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.

వృశ్చికం :

వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయకుంటే నష్టపోతారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనవసర జోక్యాల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

ధనుస్సు :

ఆకాంక్ష నెరవేరుతుంది. శత్రువుల కుట్రలను తిప్పికొడతారు. ఆదాయం పెరుగుతుంది. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. పెద్దలను కలుస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాలకు హాజరవుతారు.

మకరం :

స్థిరచిత్తంతో చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. వృత్తిపర నైపుణ్యంతో పైఅధికారుల మన్ననలను పొందుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రత్యర్థులను జయిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

కుంభం :

అనుకున్న రీతిలో పనులు సాగవు. ఆర్థిక అంశాలు చికాకు పెడతాయి. దూర ప్రయాణం ఉంది. తండ్రితో విభేదిస్తారు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. బలహీనతలను జయించాలి. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు.

మీనం :

ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవాలి. వీలైనంత వరకు కీలక వ్యవహారాలను వాయిదా వేయండి. ఆస్తి వ్యవహారాల్లో జాప్యం ఏర్పడుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. జీర్ణ సంబంధ సమస్య వేధిస్తుంది.

Tags:    

Similar News