Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (21/1/2025)
Daily Horoscope Today In Telugu, January 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (21/1/2025)
Daily Horoscope Today In Telugu, January 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
మేషం
అన్ని కార్యాల్లోనూ అనుకూల ఫలితాలు లభిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. న్యాయపరమైన వివాదాలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృషభం
పనులు సవ్యంగానే సాగుతాయి. ఆదాయమూ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సలహా పాటించండి. సంతానం వ్యవహారశైలి చికాకు పెడుతుంది.
మిథునం
కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. ఆర్థిక చికాకులుంటాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మీయులతోనే విరోధం ఏర్పడుతుంది. బద్ధకం వల్ల సమస్యల్లో పడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
కర్కాటకం
నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారు. మీలోని సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బంధాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆస్తి లావాదేవీలు వాయిదా వేయండి. వాహన సంబంధ సమస్య ఎదురవుతుంది.
సింహం
అభీష్టం నెరవేరుతుంది. అన్ని విధాలా లాభపడతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. మాట తప్పిన కారణంగా అవమాన పడే సూచన ఉంది. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు.
కన్య
ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. విందుకు హాజరవుతారు. అదృష్టం వరిస్తుంది. కీలక ఆకాంక్ష నెరవేరుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయండి.
తుల
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. మిత్రుల సహకారంతో కీలక వివాదాన్ని పరిష్కరిస్తారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. అనవసర జోక్యం వద్దు. నిద్రలేమి వేధిస్తుంది.
వృశ్చికం
పనులన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. సంతానంతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. పోటీలకు దిగకండి. మనశ్శాంతిని కొల్పోతారు.
ధనుస్సు
ఇష్టకార్యం ఫలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకరం
వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు.
కుంభం
జరుగుతున్న పరిణామాలు మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి. బలహీనతలను జయిస్తేనే కార్యజయం వుంటుంది. ఆస్తి వ్యవహారాల్లో జాప్యం ఏర్పడుతుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం
ఆకాంక్ష నెరవేరుతుంది. భాగస్వాములతో సఖ్యత ఉంటుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.