Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/1/2025)

Daily Horoscope Today In Telugu, January 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-19 19:30 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/1/2025)

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, January 20, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.


మేషం 

వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. బ్యాంకు లావాదేవీలు తృప్తినిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. పోటీదారులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు.

వృషభం 

వ్యవహారాల్లో అనూహ్య ఆటంకాల వల్ల మీ అంచనాలు తప్పుతాయి. ఆర్థిక చిక్కులు వేదనకు గురి చేస్తాయి. సంతానం తీరు నిరాశ కలిగిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఉదర సంబంధ సమస్య వస్తుంది.

మిథునం 

పనులు ఆశించినట్లు సాగవు. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన అంశాల్లో నష్టం గోచరిస్తోంది. అన్ని రంగాల్లోని వారు, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సహచరుల నుంచి సహకారం లభించదు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

సామర్థ్యాన్ని పెంచుకుంటారు. అవసరమైన చోట ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. ప్రయాణం వినోదంగా సాగుతుంది.

సింహం 

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. తోటివారికి సహాయం చేసే ప్రయత్నంలో మీరే నష్టపోయే సూచన ఉంది. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. ఎవరికీ హామీ సంతకం చేయకండి.

కన్య 

ప్రతి ప్రయత్నమూ సత్ఫలితాన్నిస్తుంది. వ్యక్తిగత, వృత్తిపర జీవితాలు సంతృప్తికరంగా సాగుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కీర్తి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల 

కష్టానికి తగిన ఫలితం ఉండదు. వ్యవహార నష్టం గోచరిస్తోంది. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పోటీలు దిగకండి. దూర ప్రయాణ సూచన ఉంది. పాదాల సమస్య వస్తుంది.

వృశ్చికం 

ఆకాంక్షలు నెరవేరతాయి. నూతన వస్తు సేకరణ ఉంది. ఆదాయం పెరుగుతుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా బావుంటుంది.

ధనుస్సు 

వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. అవకాశాలను చేజార్చకండి. పెద్దల ఆశీస్సులను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది.

మకరం 

పనులకు ఆటంకాలు వస్తాయి. బద్ధకం వీడి కష్టపడితే ప్రయోజనం లభిస్తుంది. బలహీనతలను విడిచి పెట్టాలి. ప్రయాణాల వల్ల లాభముండదు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.

కుంభం 

కార్యసాధనలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. తగాదాలు వద్దు. అధికారుల కోపానికి గురవుతారు. మనశ్శాంతి ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనం 

పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.

Tags:    

Similar News