Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (1/2/2025)
Daily Horoscope Today In Telugu, February 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, February 1, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.
మేషం
అన్ని రకాలైన లాభాలనూ పొందుతారు. ఆర్థికవృద్ధి ఉంటుంది. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం
అభివృద్ధి సాధించేందుకు అన్ని అవకాశాలూ కలిసివస్తాయి. ప్రయత్నించిన ప్రతి పనీ సఫలం అవుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభీష్టం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిథునం
కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. గతాన్ని తలచుకుంటే లాభం లేదు. కర్తవ్య దీక్షతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. గురుతుల్యులను కలుస్తారు. ప్రయాణం లాభించదు.
కర్కాటకం
నిర్దేశించుకున్న లక్ష్యం చేరే సూచనలు లేవు. కోపాన్ని బాగా అదుపు చేయాలి. అనవసర పోటీల్లో పాల్గొనకండి. పెద్దల మద్దతు లభించదు. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు లాభించవు. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.
సింహం
కోరిక తీరుతుంది. అంతర్గత ఆనందం పెరుగుతుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.
కన్య
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వివాదాల పరిష్కారంతో అపార్థాలు తొలగుతాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. అదృష్టం తోడుంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.
తుల
ఇష్టకార్యాన్ని సఫలం చేసేందుకు బాగా కష్టపడాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. వివాదాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. ఖర్చు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సమర్థతకు తగ్గ గుర్తింపు ఉండదు.
వృశ్చికం
ప్రయత్నాలకు ఆటంకాలుంటాయి. స్థిరాస్తి లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. విద్య, సేవ, మైనింగ్ రంగాల్లోని వారు కీలక వ్యవహారాలను వాయిదా వేయండి. వృథా ఖర్చు తగ్గించాలి. సంబంధాలు చెడిపోయే సూచనుంది.
ధనుస్సు
శుభప్రదంగా ఉంటుంది. సందర్భోచిత ప్రణాళికలతో వ్వయహారాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సోదరులు తోడుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.
మకరం
పనులు అనుకున్న రీతిలో జరగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల సమస్యలొస్తాయి. రెండో పెళ్లి ప్రయత్నం ఫలించదు. కంటి సమస్య ఉంటుంది.
కుంభం
వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. ఆర్థిక చికాకులుండవు. ఎదుగుదల దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులో పాల్గొంటారు.
మీనం
బద్ధకం వదిలిపెడితే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటంకపరిచే వారు పెరుగుతారు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. దూర ప్రయాణం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులు పెరుగుతాయి.