Maha Shivratri 2024: వివాహం ఆలస్యమవుతుందా.. శివరాత్రి రోజు ఇలా చేయండి..!
Maha Shivratri 2024: హిందూ మతంలో శివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు ఆ పరమశివుడిని ఆరాధిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
Maha Shivratri 2024: హిందూ మతంలో శివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజు ఆ పరమశివుడిని ఆరాధిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చాలామంది ఈ రోజున ఉపవాసం ఉంటారు జాగారం చేస్తారు. శివనామస్మరణతో ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు. ఇక శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అయితే జీవితంలో వివాహ ఆలస్యమయ్యేవారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు ఈ రోజున ఆ ముక్కంటి ఆరాధిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శివరాత్రి ఉపవాసం ప్రాముఖ్యత
మహాశివరాత్రి ఉపవాసం మానవుల క్షేమానికి ఎంతో మేలు చేస్తుంది. శాస్త్రాల ప్రకారం ఏ భక్తుడైనా మహాశివరాత్రిని నిష్టతో ఉపవాసం చేసి పూజిస్తే అన్ని రకాల దుఃఖాలు బాధలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం, శాంతి, కీర్తి, ఐశ్వర్యం వస్తుంది. మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు. మహాశివరాత్రి ఉపవాసం ఉండి శివుడికి పూజలు, జలాభిషేకం చేయడం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
ముఖ్యంగా పెళ్లికాని బాలికలు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే వారి వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం. వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి అఖండ సౌభాగ్యం, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు, తల్లి పార్వతి వివాహం జరిగింది. శివుడు ఫాల్గుణ చతుర్దశి తేదీన తల్లి పార్వతిని వివాహం చేసుకున్నాడు. అందుకే ప్రతి సంవత్సరం ఫాల్గుణ చతుర్దశి రోజున శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు.