Pitru Amavasya: పితృ అమావాస్య రోజు ఈ వస్తువులు దానం చేస్తే పూర్వీకుల దీవెనలు లభిస్తాయి..!

Pitru Amavasya: పితృ అమావాస్య రోజున చాలామంది పూర్వీకులకు వీడ్కోలు పలుకుతారు.

Update: 2023-10-14 08:42 GMT

Pitru Amavasya: పితృ అమావాస్య రోజు ఈ వస్తువులు దానం చేస్తే పూర్వీకుల దీవెనలు లభిస్తాయి..! 

Pitru Amavasya: పితృ అమావాస్య రోజున చాలామంది పూర్వీకులకు వీడ్కోలు పలుకుతారు. ఈ రోజున చేసిన కొన్ని దానాలు వారిని సంతృప్తిపరుస్తాయి. దీంతో వారు అనేక పుణ్య ఫలాలను ప్రసాదిస్తారు. హిందూ మతంలో అమావాస్యని పూర్వీకులకు అంకితం చేశారు. ఈ రోజున వారి ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం, పిండదానం తదితర పూజలు చేస్తారు. పితృ పక్షం చివరి రోజున వచ్చే సర్వ పితృ అమావాస్య ఇంకా ప్రత్యేకమైనది. జ్యతిష్యం ప్రకారం ఈ రోజున ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం.

పితృ అమావాస్య రోజున పూర్వీకులందరిని స్మరించుకుంటూ తర్పణం, శ్రాద్ధం పెడుతారు. అలాగే కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు, ధాన్యాలు దానం చేయాలి. అలాగే పేదలకు బట్టలు, ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఏడాది పొడవునా సంతృప్తిగా ఉంటారు. పితృ అమావాస్య రోజున బెల్లం, నెయ్యి దానం చేయాలి. దీనివల్ల కుటుంబంలో ఎల్లప్పుడు ఆనందం వెళ్లివిరుస్తుంది. పితృ అమావాస్య రోజున బూట్లు, చెప్పులు దానం చేయడం కూడా శుభప్రదంగా చెబుతారు. దీనివల్ల రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. పూర్వీకులు సంతోషించి దీవెనలు ఇస్తారు.

పితృ అమావాస్య రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి. ఇది పితృ దోషం, శని దోషాలను తొలగిస్తుంది. తద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు, బాధలు తొలగిపోతాయి. ఇది కాకుండా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సర్వ పితృ అమావాస్య రోజున వెండిని దానం చేయడం కూడా చాలా శుభప్రదం. అందువల్ల మీ సామర్థ్యం మేరకు ఏదైనా వెండి వస్తువును దానం చేయవచ్చు. 

Tags:    

Similar News