దొంగ దీక్షలకు 300 కోట్లు ఊదేశాడు.. చంద్రబాబు పై వైసీపీ ఎంపీ ఫైర్!
Vijayasai reddy On Chandrababu : ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి..

vijayasai reddy, chandrababu naidu
Vijayasai reddy On Chandrababu : ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి... " పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్లు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్లు. ఏది విజన్ ? ఏది దుబారా ? " అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు..
ఇక మరో ట్వీట్ లో " రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు. తేడా తెలుస్తోందా?" అంటూ ట్వీట్ చేశారు.
అలాగే " తనను తాను పాతాళంలోకి గిరాటేసుకోవడంలో బాబు గారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59 వేల కోట్ల స్కాముకు పాల్పడ్డారని దుమ్మెత్తిపోశాడు. అదే నోటితో రఫేల్ ఫైటర్లతో దేశం శక్తి పెరిగిందని కొనియాడటం ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటి!" అంటూ చంద్రబాబు పైన మండిపడ్డారు విజయసాయిరెడ్డి!