టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్న వైసీపీ.. నారాయణ తర్వాత ఎవరు టార్గెట్ అన్న చర్చ..

YSR Congress Party: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించలేం.

Update: 2022-05-11 13:30 GMT
YSRCP Gears up to get Upper Hand Over TDP

టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్న వైసీపీ.. నారాయణ తర్వాత ఎవరు టార్గెట్ అన్న చర్చ.. 

  • whatsapp icon

YSR Congress Party: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించలేం. కొందరు రాజీపడితే మరికొందరు అమీతుమీ తేల్చుకుంటారు. 2019 ఎన్నికల్లో గెలిచాక టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతోంది వైసీపీ. మూడేళ్లలో పార్టీలోని మాజీ మంత్రులను టార్గెట్ చేసుకొంది. వరుస అరెస్టులతో టీడీపీ కేడర్ కుదేలయ్యేలా చేస్తోంది. తాజాగా నారాయణ అరెస్టు తరువాత టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఎన్నికలకు రెండేళ్ల ముందు ఇంకేం చేస్తారోనన్న వర్రీలో నేతలున్నారు. రాజధాని కేసులో మిస్సయినా మాల్ ప్రాక్టీస్ కేసులో నారాయణ అరెస్ట్ ద్వారా వైఎస్ జగన్ ఎవరినీ వదిలపెట్టరన్న భావనలో నేతలున్నారు. వరుస అరెస్టులతో బాబు కోటరీలో ఉన్న కీలక నేతల్లో ఆందోళన ఎక్కువవుతోంది. నారాయణ, అచ్చెన్న, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ అరెస్టులతో టీడీపీలో ఇప్పటికే నేతల్లో ఆందోళన ఉంది. తాజాగా నారాయణ తర్వాత ఎవరు టార్గెట్ అవుతారోనన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News