Rajahmundry Central Jail: చంద్రబాబు భద్రతపై భయంగా ఉంది.. భువనేశ్వరి ఆవేదన..

చంద్రబాబుతో ముగిసిన భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణి ములాఖత్

Update: 2023-09-12 11:45 GMT

Rajahmundry Central Jail: చంద్రబాబు భద్రతపై భయంగా ఉంది.. భువనేశ్వరి ఆవేదన..

Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్దకు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి.. జైలులో చంద్రబాబును కలిశారు. అయితే.. ములాఖత్ కు జైలు అధికారులు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. తొలి రోజు ములాఖత్ కు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. మరోవైపు.. చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలవడానికి వచ్చిన నేపథ్యంలో.. రాజమండ్రి సెంట్రల్ జైల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‎

జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలు నంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రజలే తనకు ముఖ్యమని ఆయన ఎప్పుడూ అనేవారు. ప్రజల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారు. తాను బాగునున్నానని.. ఎవరూ భయపడ వద్దని చంద్రబాబు చెప్పారు అని భువనేశ్వరి తెలిపారు. మా కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్‌ కోసం నిలుస్తుంది. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది ..ఏమీ కాదు. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనే వారు. మన రాష్ట్రం.. దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలని అనేవారు. మా కుటుంబ సభ్యులకు ఇది చాలా కష్టకాలం. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి అని భువనేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News