Weather Updates: మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న వాయుగుండం..ఏపీలో భారీ వర్షాలు!
Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కొద్ది సేపట్లో కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖపట్నం కు దక్షిణంగా 130 కిలోమీటర్లు, కాకినాడ కు తూర్పు ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు, నర్సాపురం నకు తూర్పు దిశగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన తీవ్ర వాయుగుండం మరి కొద్ది గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తున్న ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నం, నర్సాపురం మధ్యలో కాకినాడ దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వివరాలు..
- కాకినాడ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం..
- మరికొన్ని గంటల్లో కాకినాడ కు అత్యంత సమీపంలో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం..
- తీవ్ర వాయుగుండం ప్రభావం తో జిల్లాలో కుండపోతగా కురుస్తోన్న వర్షం..
- రాత్రి నుంచి జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
- తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం..
- కాకినాడ నగరంలో ప్రారంభమైన తీవ్ర వాయుగుండం ప్రభావం..
- ఈదుడు గాలులతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
- మరికొన్ని గంటలలో వాయుగుండం తూర్పు గోదావరి జిల్లాలో తీరం దాటే అవకాశాలుండటం తొ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం
- ఇప్పటికే 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
- ఈరోజు, రేపు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో 1800 425 3077 నంబరుతో కంట్రోల్ రూమ్
- కీలక శాఖలను అప్రమత్తం చేసిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి
- తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీవర్షాలు
- ముంపుబారిన లోతట్టు గ్రామాలు, వరిపొలాలు
- గోదావరిని తలపిస్తున్న పలుచోట్ల రోడ్లు
- జిల్లా అంతటా విపరీతమైన ఈదురుగాలులు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షం
- కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచీ కుండపోతగా వాన
- విజయవాడలో దాదాపు అన్ని రోడ్లూ జలమయం
- లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు