చిత్తూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది, ముఖ్యంగా పంట పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఒంటరిగా ఉండకూడదని, వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.
తిరుపతి అర్బన్ , కుప్పం, రామకుప్పం, వెంకటగిరికోట, కార్వేటినగరం, గుడిపాల, పుంగనూరు, యాదమరి, బంగారుపాళ్యం, గంగవరం, చౌడేపల్లె, తవణంపల్లి, పెద్దపంజాణి, సోమల, శ్రీరంగరాజపురం, బైరెడ్డిపల్లె మండలాలల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.