కరోనా వైరస్‌ను జయించడంలో రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని, అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదివారం ఆయన దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచనలిచ్చారు.
అన్ని ఫార్మా కంపెనీలు పని చేసేలా చూడాలని సీఎస్‌లను కోరారు. జిల్లాల్లో సత్వర స్పందన (ర్యాపిడ్ రెస్పాన్స్) బృందాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.