నేడు టీటీడీ పాలక మండలి కీలక సమావేశం.. 55 అంశాలపై చర్చ
* తిరుమల, తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులకు ఆమోదించనున్న టీటీడీ * కరోనా కొత్త వేరియంట్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ
TTD Meeting: తిరుమల అన్నమయ్య భవన్ లో ఇవాళ ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న పాలకమండలి సమావేశంలో 55 అంశాలపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల, తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులకు ఆమోదం పాలకమండలి ఆమోదం తెలుపనుంది. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడజా నుండి ఎస్బీఐకి మార్చే అంశంపై చర్చించనున్నారు.
టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేళ్ల లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలుపనుంది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పని చేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపైనా బోర్డులో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.