AP BJP MLA'S LIST: ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

AP BJP MLA'S LIST: పది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ అధిష్టానం

Update: 2024-03-27 16:00 GMT
The Final List Of BJP Assembly Candidates In AP Has Been Released

AP BJP MLA'S LIST: ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

  • whatsapp icon

AP BJP MLA'S LIST : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 10 మంది అభ్యర్థులతో తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఎచ్చర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖపట్నం వెస్ట్ విష్ణు కుమార్ రాజు, అరకు నుంచి రాజారావు, ధర్మవరం సత్యకుమార్, అనపర్తి శివకృష్ణ రాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోషన్, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పార్థసారథి బరిలోకి దిగుతున్నారు. సుజనా చౌదరి రాజ్యసభ పదవికాలం పూర్తి కావడంతో ఈ సారి అసెంబ్లీ బరిలో విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో నిలవనున్నారు. .

టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. తాజాగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే భాజపా ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

కాగా.. ఏపీ బీజేపీలో కీలకంగా ఉన్న కొందరికీ ఈసారి మొండిచేయి చూపింది ఆపార్టీ అధిష్టానం. ముఖ్యంగా మాజీ చీఫ్ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, యువమోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేష్‌కు నిరాషే మిగిలింది. అయితే.. ఇటీవలే... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు బద్వేల్ టికెట్ దక్కడం విశేషం.

Tags:    

Similar News