కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి

వాహనాల రిజిస్ట్రేషన్ అక్రమాల కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ముందుగా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు రెడ్డిపల్లి సబ్‌ జైలుకు తరలించారు

Update: 2020-06-14 06:14 GMT

వాహనాల రిజిస్ట్రేషన్ అక్రమాల కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ముందుగా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు రెడ్డిపల్లి సబ్‌ జైలుకు తరలించారు. అయితే అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని అక్కడ ఉండలేమని న్యాయమూర్తి చెప్పారు.. దాంతో తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు జడ్జి.

అయితే అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో అర్ధరాత్రి తర్వాత వారిద్దరినీ కడప సెంట్రల్ జైలు తరలించారు. అయితే అంతకు ముందు ఆయన్ను కోర్టులో హాజరు పరిచే ముందు అక్కడ అనంతలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ బ్రదర్స్ సానుభూతిపరులు భారీగా రోడ్లమీదకు వచ్చి నిరసన తెలియజేశారు. కాగా ఈ కేసులో 420, 467, 468, 471, 472, 120బీ, 201, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News