AP Bandh: రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు
AP Bandh: వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ రేపు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది.
AP Bandh: రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు
AP Bandh: వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ రేపు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. దాడులు జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై చంద్రబాబు కేంద్రహోంమంత్రి, గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. ఏపీలో గవర్నర్ పాలనకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రజలంతా సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ సవాంగ్ సూచించారు. ఎవరైన రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఘర్షణలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించినట్లు డీజీపీ వెల్లడించారు. మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాయలం వద్ద భారీ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు.