ఏపీ గవర్నర్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ
* ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని లేఖ * తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని లేఖలో పేర్కొన్న SEC
(file image)
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని తెలిపారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. వ్యక్తిగత విమర్శలకు పాల్పడకుండా మంత్రులకు సూచించాలని గవర్నర్ కోరారు ఎస్‌ఈసీ.