Sajjala Ramakrishna: ఓటీఎస్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతం
Sajjala Ramakrishna: ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Sajjala Ramakrishna: ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్ విషయంలో ఎవరూ బలవంతం పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ చొరవతో వన్ టైం సెటిల్ మెంట్ పెట్టారని, దానికి సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. ఈ మేరకు చంద్రబాబుపై సజ్జల కౌంటర్ అటాక్ చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. 30 లక్షల మందికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు.