Posani Krishna Murali: ఏ దిక్కుకైనా వెళ్లండి.. బాగు పడతారు.. కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి

Posani Krishna Murali: దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు లేవు

Update: 2023-09-19 12:04 GMT

Posani Krishna Murali: ఏ దిక్కుకైనా వెళ్లండి.. బాగు పడతారు.. కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి

Posani Krishna Murali: ఏ దిక్కుకైనా వెళ్లండి.. బాగు పడతారని, కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సూచించారు. ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచావు.. కానీ ఒప్పుకోవని, రామారావును చంపావు.. కానీ ఒప్పుకోవన్నారు పోసాని.... రామారావును వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అని, 23 మంది ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొన్నది కూడా ప్రజల కోసమేనా అని పోసాని ప్రశ్నించారు.

అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారని, జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో... ఏడాదిన్నరో ఉండొచ్చు కదా అని సూచించారు పోసాని... జైల్లో ఉండి ర్యాలీలు, ధర్నాలతో నీకేం పని అని, 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నావని, దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు రాలేదని ఎద్దేవా చేశారాయన... చంద్రబాబు అవినీతి పరుడని మోడీ చెప్పారని, కానీ నువ్వు ఒప్పుకున్నావా.. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నారన్నారని అన్నారు పోసాని... నువ్వేమో మోడీని పర్సనల్‌గా తిట్టావని అన్నారు.

నారా బ్రాహ్మణి కామెంట్స్‌కు విజయవాడలో పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. దోమల మందుతోపాటు మంచి దోమతెర కొనిపెడతానని, రెండు ఏసీలు కొనిపెడతానని, తీసుకెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబుకి ఇవ్వండని ఆయన బ్రాహ్మణికి సూచించారు. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనని అనుమానం వ్యక్తం చేశారాయన... బ్రాహ్మణిని తాను నాలుగు ప్రశ్నలు అడుగుతానని, వాటికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు పోసాని... మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరని, మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరని, మీ తాతయ్యను చంపిందెవరని, జగన్ దగ్గరి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నలను సంధిస్తూ.. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే బ్రాహ్మణి కాళ్లకు దండం పెడతానని అన్నారు పోసాని కృష్ణమురళి.

Tags:    

Similar News