ఢిల్లీకి వెళ్ళిన పవన్.. జేపీ నడ్డాతో భేటి!
జనసేనాని పవన్‌కల్యాణ్ హస్తిన టూర్‌కు బయల్దేరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కూడా పవన్ కలిసే ఛాన్స్ ఉంది.
జనసేనాని పవన్‌కల్యాణ్ హస్తిన టూర్‌కు బయల్దేరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కూడా పవన్ కలిసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం.ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ వ్యవహారాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పవన్‌కళ్యాణ్ ప్రచారంపై కూడా చర్చించనుట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు అగ్రనేతల అపాయింట్‌మెంట్స్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో బీజేపీ మిత్రపక్షంగా జనసేన పార్టీ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ, జనసేన పార్టీలు.. తర్వాత కలిసిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చి, పోటీ నుంచి విరమించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని బీజేపీ అగ్రనేతలు జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కోరారు.ఈ తరుణంలో పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ ప్రచారం, తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అభ్యర్థులను ప్రకటించాయి. కానీ ఇంకా, బీజేపీ- జనసేన కూటమి మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై ఈ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత తిరుపతి ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ ప్రచారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.