చిత్తూరు జిల్లా జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్

* పురుషోత్తం, పద్మజను అదుపులోకి తీసుకున్న పోలీసులు * పోలీసులకు చుక్కలు చూపించిన పద్మజ * నేనే శివుణ్ని.. నాకు కరోనా టెస్ట్ అవసరం లేదు

Update: 2021-01-26 08:24 GMT

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పద్మజ పోలీసులకు చుక్కలు చూపించింది. కరోనా టెస్ట్‌ చేయించడానికి తీసుకెళ్తున్న పోలీసులకు పద్మజ సహకరించలేదు. తానే శివుణ్నినని తనకు కరోనా టెస్ట్‌ అవసరం లేదని పద్మజ అన్నది.

పిచ్చి పీక్స్‌కి వెళ్లింది. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నామో కూడా తెలియనంత డీప్‌లోకి వెళ్లింది. ప్రశాంతంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక భక్తి ఉన్మాదంగా మారింది. మూఢభక్తిలో రెచ్చిపోయారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం కుటుంబం అంతా అదే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో కన్న కూతుళ్లను కూడా దారుణంగా హత్య చేశారు. క్షుద్రపూజలకు బలి ఇచ్చారు చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన యువతుల జంట హత్య కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు బయటకు వస్తున్నాయి. పురుషోత్తం కుటుంబానికి మొత్తానికి మూఢభక్తి పట్టినట్టు తెలుస్తోంది.

విద్యావంతుల కుటుంబం ఇలా క్షుద్రపూజలు చేయడం ఆ కాలనీని విస్మయానికి గురి చేస్తోంది. ఆదివారం జరిగిన హత్య కేసులో కొత్త విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మృతుల తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి కరోనా టెస్ట్‌ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ, వారి పవర్తనతో పోలీసులకే కాసేపు చుక్కలు చూపించారు తానే శివుణ్ని తనకు కరోనా టెస్ట్ అవసరం లేదని పద్మజ చెప్పడం పోలీసులు అవక్కయ్యారు. చివరకు కరోనా టెస్ట్ పూర్తి చేశారు.

పద్మజకు కరోనా టెస్ట్ చేయడానికి కూడా వైద్య సిబ్బంది విఫలయత్నం చేయాల్సి వచ్చింది. పద్మజ ప్రవర్తనను చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. అయితే పిల్లలు చనిపోయారన్న పశ్చత్తాపం ఏమాత్రం కనిపించడ లేదు తానే శివుడు అనే భ్రమలో నుంచి బయటకు రావడం లేదని తెలుస్తోంది భర్త పురుషోత్తం నాయుడు మాత్రం సాధారణ స్థితికి వచ్చాడు. ఆమె సాధారణ స్థితికి వస్తేగానీ ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు. 

Full View


Tags:    

Similar News