Covid19: మళ్ళీ పడగ విప్పుతోన్న కరోనా మహ్మమారి
Covid19: కరోనా మహ్మమారి మళ్లీ జడలు విప్పుతోంది.
Covid19: కరోనా మహ్మమారి దేశంలో మళ్లీ జడలు విప్పుతోంది. ఈ దేశంలో వైరస్ సుడి తిరుగుతూనే ఉంది. చుట్టి పడేస్తూనే ఉంది. ప్రమాదం దాటి పోయిందిలే అనుకుంటే .. మరో రూపంలో వచ్చి పడింది. ఒక వైరస్ నుంచి తప్పించుకుంటే.. ఇంకో వైరస్ ..అది కూడా పోయిందిలే అనుకుంటే ఇంకొకటి. ఇలా ఒకదానికొకటి వస్తూనే ఉన్నాయి. ప్రాణాలను హరిస్తూనే ఉన్నాయి. రూపు మార్చుకుంటున్న రోగం ఇప్పుడు రాష్ట్రాలకు రాష్ట్రాలను మంచాన పడేస్తూనే ఉంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఎలా రూపాంతరాలు చెందుతోందో.. చూద్దాం.
తగ్గినట్టే తగ్గింది. కానీ.. మళ్ళీ పడగ విప్పుతోంది. రూపం మార్చి బుసలు కొడుతోంది. విషం కక్కుతూనే ఉంది. ఇంతకు ముందు కంటే ఉగ్రంగా మారుతోంది. కొత్త కొత్త రూపాలలో వెలుగు చూస్తున్న వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే అవకాశాలు లేకపోలేదని జపాన్ హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఉధృతి తగ్గడం లేదు. బాధలు తీరడం లేదు. వ్యాక్సిన్ లు వచ్చినా భయం తొలగడం లేదు. నిన్నటి దాకా కరోనా.. ఇప్పుడు అందులోనూ కొత్తకొత్త రకాలు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్ లు ప్రపంచాన్ని మరింత భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రిటన్ లో రూపు మారిన కరోనాను గుర్తించారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఇప్పుడు జపాన్ లో మరోరకం వైరస్ వెలుగులోకి వచ్చింది. భారత్ లో కూడా ఎన్నో రూపాల్లో వ్యాపిస్తున్న వైరస్ తీవ్ర భయాన్ని రేపుతోంది.
మళ్ళీ భయం పెరుగుతోంది. కొత్త కొత్త వైరస్ లు భీతి గొల్పుతున్నాయి. వాటి ప్రమాద తీవ్రత ఏపాటిదో నిర్ధారణ కాకపోయినా.. విస్తృతంగా వ్యాపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా ఎన్440కే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.