షాకింగ్: పేలిన ల్యాప్‌టాప్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు

Laptop Blast: ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా ల్యాప్​టాప్​ పేలడంతో తీవ్రగాయాలపాలైంది.

Update: 2022-04-18 13:15 GMT
Laptop Exploded Due to Short Circuit in Kadapa

షాకింగ్: పేలిన ల్యాప్‌టాప్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు

  • whatsapp icon

Laptop Blast: ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా ల్యాప్​టాప్​ పేలడంతో తీవ్రగాయాలపాలైంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమలత తీవ్రంగా గాయపడటంతో ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో ఆమె బెడ్‌పై ఉండటంతో.. బెడ్‌తో పాటు బెడ్‌షీట్‌ అంతా కాలిపోయింది. ఇంట్లో కూడా చాలా వరకు మంటలు వ్యాపించినట్లు అక్కడి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News