వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. దీంతో ఇద్దరికి 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అనంతరం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి సెంట్రల్ జైలకు తరలించారు.
బీఎస్ -3 వాహనాలను బీఎస్- 4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకు 154 వాహనాలు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్ల విషయంలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటివరకూ 24 కేసులు నమోదయ్యాయి.