JD LakshmiNarayana: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు

JD LakshmiNarayana: తనకు బెదింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు

Update: 2024-04-27 10:09 GMT

JD LakshmiNarayana: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు

JD LakshmiNarayana: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జై భారత్ నేత లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన లక్ష్మీనారాయణ సంచలనం కలిగించిన కేసులు దర్యాప్తు చేశారు. అయితే తనకి ప్రాణ హని ఉందని, రక్షణ కావాలని పోలీసులని ఆశ్రయించారు. ఉద్యోగ జీవితానికి విరామం ఇచ్చేసి జై భారత్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కి వచ్చారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి లక్ష్మి నారాయణ పోటీ చేస్తున్నారు. ఈ క్రమం లో తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని. తనకి రక్షణ కల్పించాలని లక్ష్మి నారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ ని ఆశ్రయించడం ఇప్పుడు విశాఖ లో చర్చ కి దారి తీసింది.

పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్షపడేలా చేశానని తన మీద కక్ష కట్టారటూ జేడి కామెంట్స్ చేశారు. తనకు వచ్చిన ఇన్ పుట్స్ ద్వారా సీపీ గారికి కలిసి ఫిర్యాదు చేశానన్నారు. తాను ఇంతవరకు సాధారణంగా సెక్యూరిటీ కోరుకోలేదన్నారు. తాను ప్రజల మనిషినన్నారు .ఇప్పుడు కూడా తాను ఈ బెదిరింపులపై ఫిర్యాదు చేసే వాడిని కాదని తన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందడం వల్లే ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు.సోషల్ మీడియా లో కూడా బెదిరింపులు కు సంబంధించి పోస్టులు చూశానన్నారు.

Tags:    

Similar News