మండలం వ్యవసాయ అధికారి అమర శివ, పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ, ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 53 ప్రకారం వ్యవసాయం, ఉద్యానవన పనులకు వెసులుబాటు కల్పించారు అని వ్యవసాయ పనులు సామాజిక దూరం మూడు మీటర్లు పాటిస్తూ చేసుకోవచ్చునని, వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ పనుల్లో పాల్గొనవచ్చని, వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలు రవాణా చేసుకోవచ్చునని, వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు యంత్రాలు రిపేరింగ్ చేయించుకోవచ్చు.
రైతు కొనుగోలు కేంద్రాలలో విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసుకోవచ్చని, ప్రభుత్వం మద్దతు ధరకై 1907 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని వ్యవసాయ అధికారి శివ తెలియజేశారు.