Srikakulam: అతనికి 73 ఏళ్లు.. ఆమెకు 69 ఏళ్లు.. వీరు కరోనా విన్నర్స్
Srikakulam: అతనికి 73 ఏళ్లు.. ఆమెకు 69 ఏళ్లు. పెద్దాయన క్యాన్సర్ పేషెంట్. ఆ తల్లి హార్ట్ పేషెంట్.
Srikakulam: అతనికి 73 ఏళ్లు.. ఆమెకు 69 ఏళ్లు. పెద్దాయన క్యాన్సర్ పేషెంట్. ఆ తల్లి హార్ట్ పేషెంట్. పుట్టెడు మందు బిళ్లళు మింగుతూ కాలం వెళ్లదీస్తున్న ఈ వృద్ధ దంపతులను సడన్‌గా కరోనా వైరస్ పలకరించింది. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏమైనా ఇంకొకరు బతకరు. అలాంటి వీళ్ల శేష జీవితంలోకి కరోనా ఎంటరై కల్లోలం సృష్టించింది. కానీ వీరి సంకల్పం ముందు కరోనా చిత్తుగా ఓడిపోయింది. వీరి ధైర్యాన్ని చూసిన కరోనా వచ్చిన దారినే తలవంచుకొని వెళ్లిపోయింది. ఇంతకీ ఆ వృద్ధ దంపతులు కరోనా విజేతలుగా ఎలా మారారు. ఆ వయస్సులో కరోనాకు ఎలా చెక్ పెట్టారు.
కరోనా కండలు తిరిగిన యోధులను మింగేసింది. పెద్ద పెద్ద బాడీ బిల్డర్లను కూడా బలితీసుకుంది. ఎంతో మంది యువకులను పొట్టనపెట్టుకుంది. కానీ ఈ వృద్ధ దంపతుల మీద కరోనా కరుణచూపించింది. వీళ్ల దీక్షా పట్టుదల ముందు వైరస్ ఓడిపోక తప్పలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు పీవీఆర్‌ఎం పట్నాయక్, కమల. వీళ్లకు వయస్సు మల్లింది. పైగా క్యాన్సర్, హార్ట్ పేషంట్లు సడన్‌గా దంపతులకు కరోనా సోకడంతో అందరు భయపడిపోయారు. కానీ వీళ్లు మాత్రం చిరునవ్వు చెరిగిపోనివ్వలేదు. నువ్వు మమల్ని ఏమీ చేయలేవు అన్నట్లుగా కరోనా వ్యాధిని సింపిల్‌గా డీల్ చేశారు. చివరకు బోసి నవ్వులు నవ్వుతూ కరోనాను తరిమికొట్టారు.
శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలో కమలా నివాస్ అపార్ట్‌మెంటులో ఈ వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. ఈ పెద్దాయన ఎన్‌టీపీసీ ఉద్యోగిగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యాక ఈ ఇద్దరు ఈ అపార్ట్‌మెంట్‌లోనే శేష జీవితం గడుపుతున్నారు. ఇంతలో వీరికి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయి. ప్రతి నెలా కిమోథెరపీ కోసం ఆయన. మందుల కోసం ఆ తల్లి విశాఖపట్నం వెళ్లి వస్తుంటారు. మాయదారి కరోనా ఎక్కడ తగిలిందో కానీ వీరికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
ఐనా ఆ వృద్ధ దంపతులు బెదరలేదు. ఎన్ని రోగాలు చూసాం ఎన్ని బాధలు పడ్డాం ఈ కరోనా ఓ లెక్కనా అని ఫీలయ్యారు. పెద్ద పెద్ద రోగాలతో సహవాసం చేసిన తమను కరోనా ఏం చేస్తుందని ధైర్యం తెచ్చుకున్నారు. వైరస్‌కే వణుకుపుట్టేలా జాగ్రత్తలు పాటించారు. వాళ్లు రెగ్యులర్‌గా వాడే మందులతోపాటు నాలుగు విటమిన్స్ బిళ్లలు మింగేశారు. డాక్టర్ సూచించిన విధంగా నడుచుకున్నారు. కట్ చేస్తే కరోనా పారిపోయింది. టెస్ట్ చేస్తే నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.
నిజానికి కరోనాకు ప్రాణాలు తీసేంతా శక్తి లేదు. మన భయమే.. దానికి బలం.. వేళకు మందులు వాడుతూ కాసిన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా మాటుమయం అవుతుందని కరోనా విజేత కమల అంటున్నారు. వీరు చెబుతున్నదే ఒక్కటే భయమే మన శత్రువు. ధైర్యమే మన ఆయుధం. మనోధైర్యంతో ఉంటే కరోనా జేజమ్మ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదంటున్నారు. కరోనా పేషంట్లకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ వృద్ధ దంపతులకు హెచ్‌ఎంటీవీ కూడా సెల్యూట్ చేస్తోంది.