ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకూ 11,602 నమూనాలను పరీక్షించగా మొత్తం 135 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే కోవిడ్ భారిన పడి ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4261 గా ఉంది. అయితే ఇందులో 2540 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కూడా 65 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 80కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా టెస్టులు 5 లక్షలు దాటాయి. రాష్ట్రంలో మొత్తం 5,04,889 పరీక్షలు చేశారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టాలంటే టెస్టులు కంపల్సరీ చేసింది ప్రభుత్వం. ఇందుకోసం వివిధ చెక్ పోస్టుల వద్ద టెస్టింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఈపాస్ కూడా తప్పనిసరిగా ఉంటేనే అనుమతిస్తుంది.