coronavirus : ఏపీలో రికార్డు స్థాయిలో 22,371 వేల పరీక్షలు.. కేసులు చూస్తే..
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ 22,371 నమూనాలు పరీక్షించగా 390 పాజిటివ్ కేసులొచ్చాయి.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ 22,371 నమూనాలు పరీక్షించగా 390 పాజిటివ్ కేసులొచ్చాయి. అలాగే కరోనా భారిన పడి 5 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 8452 కు చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 101కి చేరింది.
మరోవైపు శుక్రవారం 138 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4111 కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో ప్రస్తుతం 4240 మంది బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా టెస్టులు రికార్డు స్థాయిలో 22,371 చేయడం ఇదే మొదటిసారి.