ఏపీలో 8లక్షల 5వేలు దాటిన కరోనా రికవరీ కేసులు
ఏపీలో 8లక్షల 5వేలు దాటిన కరోనా రికవరీ కేసులు
Andhra Pradesh | ఏపీలో కరోనా రికవరీ కేసులు 8లక్షలు దాటాయి. రికవరీ రేటు పెరగడంతో ఇప్పటివరకు 8లక్షల 5వేల 26మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఇక, కరోనా పరీక్షలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటివరకు 83లక్షల 42వేల 266మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 8లక్షల 33వేల 208మందికి వైరస్ సోకగా ఇప్పటికే 8లక్షల 5వేల 26మంది కరోనా రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కరోనా రోగుల రికవరీ రేటు బాగుండటంతో ప్రస్తుతం 21వేల 438 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇక, ఈరోజు 2477 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 75వేల 465మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 2వేల 477మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే, గత 24గంటల్లో 10మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 6744కి చేరింది. కరోనా రోగుల డెత్ రేట్ తగ్గుతుండటంతో రోజురోజుకీ మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఇక, ఈరోజు గుంటూరు, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు.