ఔషదాల తయారీ సంస్థ గిలీడ్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటి

వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు.

Update: 2019-08-17 03:51 GMT

వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ఆయన అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఆహ్వానం మేరకు విందులో పాల్గొనున్నారు. అనంతరం డీసీలో పలువురు ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. , అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు.

అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరైన రాష్ట్రమన్నారు ఏపీ సీఎం జగన్‌. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వాన్ని అందించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ గిలీడ్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటికానున్నారు. హెచ్‌ఐవీ, హెపటైటిస్‌బి,సి వ్యాధులపై మందులను తయారు చేస్తున్న గిలీడ్‌ ఏపికి చెందిన ఔషద కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని పిలుపునివ్వనున్నారు. హైఎండ్‌ ఔషధాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించనున్నారు. ఫార్మా రంగంలో ఉత్తమ టెచక్నాలజీని అందించాలని కోరనున్నారు.


  













 


Tags:    

Similar News