ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

CM Jagan: అమ్మవారి సన్నిధికి వచ్చిన సీఎం జగన్

Update: 2022-10-02 11:02 GMT
CM Jagan Visit Vijayawada Kanaka Durga Temple | AP News

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

  • whatsapp icon

CM Jagan: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్‌కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News