Chandrababu: సీఎం జగన్‌ ఇసుక దోపిడీ రూ.40వేల కోట్లు

Chandrababu: NGT ఆదేశాలు కూడా ఉల్లంఘించారన్నారు

Update: 2023-08-25 13:05 GMT

Chandrababu: సీఎం జగన్‌ ఇసుక దోపిడీ రూ.40వేల కోట్లు

Chandrababu: ఇసుకాసురుడు రూ.40వేల కోట్లు దోపిడీ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఇసుకపై 40 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు ఆధార పడ్డారని... టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చామని చెప్పారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 48 మంది బలయ్యారని తెలిపారు. ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదన్నారు. జిల్లాల వారీగా వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారని మండిపడ్డారు. NGT ఆదేశాలు కూడా ఉల్లంఘించారన్నారు. నాలుగున్నరేళ్లలో 40 కోట్ల టన్నుల అక్తమ తవ్వకాలతో 40 వేల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏర్పాటు చేసిన పోస్టర్స్‌ను పరిశీలించారు.

Tags:    

Similar News