Biometric Attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పని సరి

Biometric Attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూలై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం.

Update: 2021-06-30 07:02 GMT

AP Village and ward secretariat:(File Image)

Biometric Attendance: జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలను చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని సూచించారు.

అలాగే సెలవులకు దరఖాస్తును ఇక నుంచి హెఆర్‌ఎంఎస్‌లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. అటు ప్రతీ రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి ప్రజల వినతులను తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు డ్యూటీలో భాగంగా సమావేశాలకు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మూమెంట్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని భరత్ గుప్తా తెలిపారు.

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్‌ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్‌ అసిస్టెంట్, వార్డు విద్య అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్‌ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, రేపట్నుంచి బయోమెట్రిక్ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని పై ఆ ఉద్యోగులు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Tags:    

Similar News