Vijayawada: కరోనా వైరస్ పై అవగాహన మాస్క్ లు పంపిణీ
స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్ దబాకోట్లు సెంటర్లో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్య పరుస్తూ పేస్ మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వ హించారు.
విజయవాడ: స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్ దబాకోట్లు సెంటర్లో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్య పరుస్తూ పేస్ మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బోండా. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ పేస్ మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉమా మాట్లాడుతూ కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా నమోదువ్వు తున్న సందర్భంలో ప్రజలు భయాందోళన చెందకుండా దాన్ని అరికట్టాలని అన్నారు. మన పరిసరాలను వ్యక్తిగత శుభ్రత అవసరమని దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే బయిటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడంమంచిది అన్నారు. చాలా వేగంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని అవహేళన చేస్తూ బ్లీచింగ్ పొడి ఇస్తే పోతుంది అని, పారాసెటమాల్ టాబ్లెట్ ఏసుకుంటే వైరస్ తగ్గిపోతుంది అనడం చాలా దుర్మార్గం అన్నారు.