ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు..

AP High Court: *జీవో నెం.35ను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు *పాత విధానంలో సినిమా టికెట్ల రేట్లు

Update: 2021-12-14 11:15 GMT
AP High Court Cancelled the GO about  Cinema Tickets Price Down | AP Breaking News

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు.. 

  • whatsapp icon

AP High Court: ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది హైకోర్టు. జీవో నెంబర్ 35ను సస్పెండ్‌ చేసింది. పాత విధానంలో సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. థియేటర్ యాజమాన్యాల తరపున సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ, దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపించారు.

సినిమా టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, కొత్త సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకునే ఛాన్స్ థియేటర్ల యజమానులకు ఉంటుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో.. థియేటర్‌ యాజమాన్యాల తరపున న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. జీవో నెంబర్‌ 35ను సస్పెండ్‌ చేసింది.

Tags:    

Similar News