AP News: రెండు నెలలపాటు.. సముద్రంలో వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP News: ఈనెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

Update: 2024-04-10 15:05 GMT

AP News: రెండు నెలలపాటు.. సముద్రంలో వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP News: సముద్రంలో వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈనెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధిస్తున్నామని, జూన్‌ 14 వరకు రెండు నెలల పాటు నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ కమిషనర్‌ సూర్యకుమారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం చేపలు, రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలం నడుస్తోందని,తల్లి చేప, రొయ్యలను సంరక్షించడం... వాటి సంతతి పెరుగుదల కాకుండా నిషేధిస్తున్నామని సూర్యకుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని, బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. జరిమానా విధించి డీజిల్‌పై రాయితీ నిలిపేస్తామని, అన్నిరకాల సౌకర్యాలను నిలిపేస్తామని హెచ్చరించారామె.... 61 రోజుల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు... నేవీ, రెవెన్యూ అధికారులు నిరంతరం గస్తీ తిరుగుతారని సూర్యకుమారి తెలిపారు.

Tags:    

Similar News