ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

Update: 2020-10-06 06:06 GMT
ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ
  • whatsapp icon

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరగనుంది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

Tags:    

Similar News